Thursday, February 19, 2026

బాధితులపై మహిళా ఎస్సై వీరంగం

ద్రోణ హైదరాబాద్ హీరో

హైదరాబాద్‌: నగరంలో ఓ మహిళ ఎస్ఐ దౌర్జన్యానికి దిగారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులపైనే సదరు ఎస్ఐ దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ నెల 17వ తేదీన మధురానగర్‌లో ఓ వైన్స్ షాపు సిబ్బంది దాడిలో గాయపడిన రమేష్ దంపతులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కాగా.. ఇక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళ ఎస్ఐ తాము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోగా తమను దూర్భాషలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా రమేష్‌ను అతని భార్య ఎదుటే కొడుతూ.. బాధితుడి మర్మాంగాలపై 3 సార్లు ఎస్ఐ తన్నారని ఆయన భార్య తెలిపారు. బాధితులమైన తమను కులం పేరుతో ధూషించడంతో పాటు పీఎస్‌లో తీవ్రంగా హింసిచారని రమేష్ దంపతులు ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular