Thursday, February 19, 2026

గంజాయి పట్టివేత

ద్రోణ నిజామాబాద్ బ్యూరో

నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమి రెడ్డి సూచనల మేరకు మల్లా రెడ్డి ఆదేశాలకు మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ టీం ఖిల్లా చౌరస్తా నిజామాబాదు నందు గంజాయి అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు తేదీ 23.05.2024 ఉదయం ఖిల్లా చౌరస్తా లో తనిఖీలు నిర్వహించగా (1.220)కేజీల గంజాయి లభించింది. ఇట్టి దాడుల్లో ఒక వ్యక్తి నీ అదపు లో తీసుకొన్నారు. విచారించగా అతని పేరు సదుల్ల ఖాన్ అనే చెప్పారు. ఇంకొక ఒక వ్యక్తి పరార్ ఆయినారు.పరార్ అయిన వక్తి గురించి విచంరిచ గా అతని పేరు ఎండి యునెస్ అలియా స్ రిజ్వాన్ దగ్గర నుంచి గంజాయి తీసుకొని అమ్ముతున్నాను అని సదుల్ల ఖాన్ చెప్పాడు.మొత్తం ఎండు గంజాయి (1220 ) గ్రాము లు దొరికినది.పై ఇద్దరి పైన కేసు నమోదు చేశారు. సాదుల్ల ఖాన్ అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచారు.పరారీ లో ఉన్న యునుస్ ను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ హెచ్ ఓ దిలీప్ తెలిపారు. సదుల్లా ఖాన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఎన్ డి పి ఎస్ 1985 చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం,అమ్మడం నేరం కావున వీరిపైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. తనిఖీలలో నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.దిలీప్ ,ఎక్సైజ్ ఎస్ ఐ లు సుష్మిత ,సింధు సిబ్బంది ప్రభాకర్,షబ్బీరుద్దీన్,సంగయ్య,దారి సింగ్ సంజయ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular