బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామపంచాయతీలో గల తెలుగు మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్ మరమ్మత్తులకు 6 లక్షల 90 వేల రూపాయలు, ఉర్దూ మీడియం ప్రైమరీస్ పాఠశాల మరమ్మత్తులకు 4 లక్షల 10 రూపాయలు, ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరమ్మత్తుల కోసం 4 లక్షల 65 వేల రూపాయలు అమ్మ ఆదర్శ నిధులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంజూరు చేయడం పట్ల ఊటుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టప్పా సాయిలు, నాయకులు సాయిరెడ్డి,అశోక్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,అబ్దుల్ ఖాదర్, ఇస్మాయిల్,అహ్మద్,నర్సయ్య, జమీల్,గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు టప్పా సాయిలు మాట్లాడుతూ గత 10 సంవత్సర కాలంలో ఊట్ పల్లి గ్రామానికీ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అభివృద్ది పనులు చేసిందేమీ లేదని ఆయన అవేదన వ్యక్తం చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుతం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ 2 లక్షలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం ఖాయమని అన్నాను. బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అమ్మ ఆదర్శ నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES
