ప్రైవేటు పరమవుతున్న ఆర్టీసీ
లోకల్ బస్సులు ఎందుకు కొత్తవి రావట్లేదు
బోధన్ డిపో ఉండేనా పోయేనా
ప్రైవేటు బస్సుల మీద ఆధారం
డిపో బస్సులు మాయమా
బోధన్ నియోజకవర్గంలో గల బస్సు డిపో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని లాభాలలో నడుస్తుందని మనందరికీ తెలిసిన విషయమే డ్రైవర్లు కండక్టర్లు ఎంతో కష్టపడి డిపో ని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్నిసార్లు డిమాండ్లను ఒప్పించుకొని డ్యూటీలు చేశారు. కరోనాలో ఒక సైతం ఎవరినీ లెక్క చేయకుండా గవర్నమెంట్ ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వారు కర్తవ్యం నిర్వహించారు. ఈరోజు బోధన్ డిపోలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతుంది. 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీ పోస్టులు పడకపోవడం రిటైర్మెంట్లు కరెక్ట్ గా లేకపోవడం జీతాలు సవ్యంగా లేక పోయిన కర్తవ్యం నిర్వహణలో డ్యూటీలు చేస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు అలాంటి ఆర్టీసీ డిపోలు బస్సులు లేక అనేది ఆలోచించదగ్గ విషయం ఎటు చూసినా దూరాభారం లో ఉన్న వాటికి మాత్రమే కొత్త బస్సులను తీసుకురావడం లోకల్ గా ఉన్న డిపోలకు ఆర్టీసీ బస్సు లేకపోవడం. గత 40 సంవత్సరాల కిందట జరిగే విషయాలే మళ్ళీ కట్టినట్టు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిని ఏదో నామమాత్రంగా ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులతో సరిపెడుతున్నారని అపోహలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు రాజకీయాలు లేకుండా సామరస్యంగా సర్దుకొని పోయే గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతోమందితో బాధలు పడుతూ డిపోలను ఎంతో పైకి తీసుకువచ్చారు వారికే ఈ రోజు నిలువ నీడ లేక పోతుందేమోనని భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలకు వత్తాదు పలుకుతూ డిపోలను ప్రైవేటుపరం చేయాలని ఉద్దేశాలతోటే ఈ విధంగా చేస్తున్నారేమోనని ఒక్క బోధన్ డిపోలోనే 40 నుంచి 45 ప్రైవేటు బస్సులు ఉన్నాయని వారికి టెండర్లలో ఇచ్చిన వాటికంటే ఎక్కువ ట్రిప్పులను వేయించుతూ గవర్నమెంట్ డిపోని ప్రైవేటు డిపోగా మారుస్తున్నారు. మొన్నటిదాకా ఎంతో లాభాలలో నడిచినటువంటి బోధన్ డిపో బస్సులు కొనే పరిస్థితులలో కూడా లేదనే అపోహలు బయటకు వెళ్లవేడుతున్నాయి. నిన్న కాకమున్న వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలకు తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది. ఆర్టీసీ బస్సుల కన్నా కూడా ప్రైవేటు బస్సుల పరమయిపోయింది. వారికి కూడా రావలసిన బిల్లులు సరిగా రావడం లేదని వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందుకే మధ్యలోనే బస్సులను తీసివేస్తున్నారని తెలిసింది.
