ద్రోణ నిజాంబాద్ బ్యూరో
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని నడుకుడా గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన అన్నారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రవి అనే మత్సకారుని వలకు భారీ చేప చిక్కింది. భారీ చేప కట్ల బొచ్చ రకానికి చెందినదిగా దాని బరువు 23 కిలోలు ఉందని ఆ చేపను నందిపేట గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు మత్స్యకారుడు ఎర్రోళ్ల రవి తెలిపారు.
