Tuesday, February 17, 2026

స్థల వివాదాన్ని మతాలకు రంగు పూయ వద్దు

గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామం లో విగ్రహం ఏర్పాటు స్థలం వివాదం కు సంబంధించి ఆ స్థలం ఎవరిది అనేది ప్రభుత్వ శాఖ అధికారులు అతి త్వరలో నిర్ణయిoచి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ పోలీస్ శాఖ ఒక ప్రకటనను విడుదల చేశారు.ఈ వివాదాన్ని ఎవరు కూడా మతతత్వ రంగు అంటించవద్దు అని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.
గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ స్థల వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఆ స్థలం ఎవరిది అనేది గుర్తించే పనిలో ఉన్నారని, అతి త్వరలో ఆ స్థలం ఎవరిది అనేది గుర్తించడం జరుగుతుందని, అనంతరం వివాదానికి కారకులైన వారి పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికే వివాదాస్పద స్థలం భూ యజమానులను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తి కసరత్తు చేస్తుందని, ఆ స్థలం యాజమాన్యానికి సంబంధించి రెవెన్యూశాఖ నిర్ణయం రాగానే వివాదానికి కారకులైన వారి పై పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని ,ఈ సమస్యను ఎవరు కూడా మతతత్వ రంగులోకి మార్చవద్దని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వసించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ వివాదాన్ని మతాల మధ్య గొడవ గా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే వారి పైన, సోషల్ మీడియా లో పోస్టులు పెట్టే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సోషల్ మీడియా పై ఇప్పటికే పోలీస్ శాఖ నిఘా పెట్టడం జరిగిందనీ జిల్లా ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular