ద్రోణ హైదరాబాద్ బ్యూరో
హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పికెట్ డిపోకు చెందిన సూపర్ లగ్జరి బస్సు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం రాంనుంతల గేటు, వాసుదేవ్ పూర్ గేటు మధ్యకు బస్సు రాగానే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఐ20కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
