Thursday, February 19, 2026

బి.ఆర్.ఎస్. పార్టీ విషపూరిత ప్రచారాలను నమ్మొద్దు

గత పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ
యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ అని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.
తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియమ్మ.దొరల అహంకార పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు.ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయకుండా యువత భవిష్యత్తు నాశనం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.టీఎస్పిఎస్సీ లీకేజీ ద్వారా, ఉద్యోగ భర్తీ ప్రకటనలు ఇవ్వకుండా యువతను గందరగోళానికి గురి చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.
ములుగు జిల్లాలో ప్రభుత్వ వనరులను దోచుకున్న పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.అర్హులైన వారికి రెండు పడక గదుల ఇండ్లు ఇస్తా అని నమ్మించి మోసం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.

తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వని పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి వందల కోట్లు దోచుకున్న పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించని పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా పహాని వ్యవస్థను నాశనం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్. పార్టీ.
లిక్కర్ కుంభకోణం, పేపర్ లీకేజీ ఇలా ఎన్నో దారుణాలు చేసిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.
గత పదేండ్ల పాలనలో యావత్తు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచుకన్న పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని ఆరునెలలు కాకుండానే కావాలని నేడు కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తుంది బి.ఆర్.ఎస్.పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు 500 రూపాయల బోనస్ పథకాలు ప్రవేశ పెట్టిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎన్నో మెగా డి.ఎస్.సి లాంటి ప్రకటనలు ఇచ్చారని, అలాగే శాశ్వత పద్ధతిన ఉద్యోగ భర్తీ చేపట్టి, గత పదేండ్ల దుర్మార్గుల పాలన నుండి తెలంగాణ విముక్తిని చేపడుతుందని అన్నారు. అధికారం కోల్పోయిన బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీపై కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గం అని అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని గెలిపించాలని, మల్లన్న కూడా పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని, దొరల అహంకార పూరిత ధోరణిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యక్తి అని, బి.ఆర్.ఎస్. పార్టీ అన్యాయాలను, అక్రమాలను బయటికి తీసిన ప్రజా గొంతుక అని, అలాంటి వ్యక్తిని పట్టభద్రులు అందరూ మే 27 న రెండవ నెంబర్ యందు హస్తం గుర్తుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular