Thursday, February 19, 2026

రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య

ద్రోణ వరంగల్ బ్యూరో

వరంగల్ జిల్లా:మే 25
రైలు కింద పడి యువతి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీల వద్ద నవజీవన్ ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహ త్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందగా..మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలిం చారు. తీవ్ర గాయాల పాలై న యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరాలు తెలియ జేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular