Thursday, February 19, 2026

మీ మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకే వేయండిఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ద్రోణ వరంగల్ బ్యూరో

భూపాలపల్లి పట్టణం
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకే వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించండని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.శనివారం భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం) ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే అన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో లో పెట్టిన ప్రతీ హామిని నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular