Thursday, February 19, 2026

రైతుల హామీలన్నీ నెరవేర్చాలి

ద్రోణ బోధన్ ప్రతినిధి

వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ డిమాండ్ చేశారు.
బోధన్ పట్టణం లోని మిల్లర్ల భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరప్ప అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శోభన్ హాజరై మాట్లాడుతూ
కాంగ్రెస్‌ ప్రభుత్వం మ్యానిపెస్టోలో ‘రైతుల సమస్యల పరిష్కారం’ పై ప్రకటన చేశారు. మ్యానిఫెస్టోలో చేసిన హామీలను అమలు చేయాలి. భూమాతగా ప్రకటించిన ధరణిలోని లోపాలను సరిచేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూ సమస్యలపై గల లోపాలను సవరించి అందరికి పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. సమగ్ర భూ సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరిపి లోపాలను సవరించాలి. రెవెన్యూ రికార్డులలో కౌలు రైతుల పేర్లు , వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయుటకు రెవెన్యూ రిజిస్టర్‌లలో ‘కాలం’ను ఏర్పాటు చేయాలి. వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి. సాగుదారులందరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.12500 సబ్సిడి ఇవ్వాలి. గత రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుండి ‘కేంద్ర పిఎం ఫసల్‌ బీమా’ నుండి విరమించుకుంది. అప్పటినుండి రాష్ట్ర రైతులకు ఎలాంటి పరిహారం రావడంలేదు. ఏటా రూ.5,000 కోట్ల పంటలు నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రూపొందించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల పరిహారం ఇవ్వాలి. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి పథకాలను పూర్తి చేయాలి. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులను రానున్న ఎడాదిలో పూర్తి చేయాడానికి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కాళేశ్వరం సహా భారీ ప్రాజెక్టులలో జరిగిన అవినీతిని ‘హైకోర్టు జడ్జి’ ద్వారా విచారణ జరిపించాలి. నేరస్తులను శిక్షించాలి. సబ్సిడిపై మైక్రోఇరిగేషన్‌(డ్రిప్‌, స్పింక్లర్‌) పరికరాలు అందించాలి. ఐడిసి నిర్వహణలోని లిప్ట్‌ పథకాలను రిపెర్లు చేయాలి. రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కల్తీ విత్తనాల వ్యాపారం సాగుతుంది. ఏటా 4,5 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయి. కల్తీ విత్తనాలను పట్టుకోవడమే తప్ప నేరస్తులపై ఏలాంటి శిక్షలు లేవు. నష్టపోయిన రైతులకు పరిహారాలు లేవు. ‘వెంటనే ప్రభుత్వం ‘రాష్ట్ర విత్తన చట్టా’న్ని రూపొందించాలి. కల్తీ విత్తన సంస్థల కంపెనీలను రద్దు చేయాలి. గత 2 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ ‘యాక్షన్ ప్లాన్‌’ ప్రకటన లేదు. వెంటనే వార్షిక ప్రణాళికలు ప్రకటించాలి. ఈ వార్షిక ప్రణాళికలో ప్రాంతాల భూసారాన్నిబట్టి పంటల విధానాన్ని రూపొందించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన రైతు బరోసా పథకం ప్రకారం ఎకరాకు రూ.15,000 చోప్పున రైతుల ఖాతాలో వేయాలి. యాసంగి పంటలకు సంబందించి ఎకరాకు రూ.7500 చోప్పున వాస్తవ సాగుదారులందరికి వారి ఖాతాలలో జమ చేయాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు, బోనస్‌ వెంటనే అమలు చేయాలి. వడ్లకు క్వి/రూ.2683తో సహా మొక్కజొన్న తదితర పంటలకు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ధరలను వెంటనే అమలు చేయాలి. అందుకు వ్యవసాయ శాఖ మార్కెట్‌ కమిటీలకు జిఓ విడుదల చేయాలి. లీటర్‌ పాలకు రూ.5 బోనస్‌ అమలుకు నిధులు విడుదల చేయాలి. రాష్ట్ర స్థాయి ‘వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమీషన్‌’ ఏర్పాటు చేసి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి. రూ.2లక్షల లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలి. రిజర్వుబ్యాంక్‌ ఆదేశాల ప్రకారం బ్యాంకులు తమ డిపాజిట్లలో 18 శాతం ‘స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌’ ప్రకారం రుణాలు ఇవ్వాలి. అటవీహక్కుల చట్టం -2006 ప్రకారం అర్హులకు హక్కు పత్రాలు ఇవ్వాలి. మూసివేసిన చెరుకు ప్యాక్టరీలను తెరిపించుటకు చర్యలు ప్రారంభించాలి.అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, గంగమణి, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, నాగలక్ష్మి, నాయకులు ముత్తన్న, సుశీల, సాయిలు, పద్మ, మురళీ, లక్ష్మి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular