ద్రోణ ఖమ్మం బ్యూరో
కొత్తగూడెం ( ) సిపిఐ, సిపిఎం, టిజెఎస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ కో-ఆర్డినేటర్ నాగా సీతారాములు కలెక్టరేట్ ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. తీన్మార్ మల్లన్న గెలుపు చారిత్రక అవసరమని ప్రతి పట్టబధ్ర ఓటరు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, విజ్నులైన ప్రతి పట్టబద్రుల ఓటరు ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్న ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, శంకర్ నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, జడ్పీటీసి సభ్యులు బరిపటి వాసుదేవరావు, టిజెఎస్ శివప్రసాద్, మాజీ జడ్పీటీసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, ఆంతోటి పాల్, ఎల్డిఎమ్ కన్వీనర్ బద్ది కిషోర్, సిపిఎం పట్టణ కార్యదర్శి దొడ్డా రవి, టీజెఎస్ నాయకులు దేవదానం, కాంగ్రెస్ నాయకులు ఎస్విఆర్కే ఆచార్యులు, హెచ్ మధు, భూక్యా గిరి ప్రసాద్, కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, దారా చిరంజీవి, కాపర్తి వెంకటాచారి, పులి సత్యనారాయణ, వజ్జల రాము, పాబోలు నాగేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, యువజనకాంగ్రెస్ నాయకులు వుండేటి శాంతివర్ధన్, లక్ష్మణ్, ఇమ్మడి నవీన్, వసుమల్ల సుందర్, సత్తార్, గౌస్, బొల్లం ఉదయ్ కుమార్ యాదవ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
