Friday, February 20, 2026

కసాయి తల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలి

ద్రోణ నిజాంబాద్ ప్రతినిధి

మహిళలపై మైనర్ బాలికలపై దాడులకు అడ్డగా మారుతున్న నిజాంబాద్ జిల్లా జానకంపేట నిజాంసాగర్.కెనాల్ కట్ట వద్ద మైనర్ బాలికపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న ఐద్వా మహిళా సంఘం నాయకులు జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా కార్యదర్శి సుజాత కమిటీ సభ్యులు జ్ఞానేశ్వరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ అమ్మాయి మాట్లాడలేని పరిస్థితిలో ఉందని అమ్మాయిని ఆటో ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన కసాయి తల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ మరియు అనుమాన స్పదంగా ఉన్నా వారిని శిక్షించాలని అన్నారు. మైనర్ బాలికకు రక్షణ కల్పించి న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసారు.ఎక్కడికి తీసుకెళ్లారు ఏం చేశారో ఆ బాలికను దాడి చేయడమే కాకుండా హత్య ప్రయత్నం కూడా చేసినట్టు డాక్టర్లు చెప్తున్నారు. అమ్మాయికి కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ఎవ్వరూ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా స్పందించకపోవడం గమనారహం కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పోలీస్ సిబ్బంది నిందితులు ఎవరైనా సరె కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ లేదంటే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular