Sunday, May 10, 2026

భూగర్భ గనుల శాఖలో అధికారులపై వేటు

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలోని అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు అధికారులపై వేటు వేసింది. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పని చేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను వారి మాతృ సంస్థలకు బదిలీ చేసింది. వీరి అవినీతిపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా చర్యలు తీసుకుంది. మరో వైపు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్న పలువురు అధికారులపై రెయిడ్స్ చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. వారిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ను అరెస్ట్ చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular