Friday, February 20, 2026

దేశంలో మోడీ హవా – కోటపాటి

ద్రోణ నిజామాబాద్ బ్యూరో

ఆర్మూర్ లోని ” ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక”
కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశం లో కోటపాటి నరసింహనాయుడు మాట్లాడారు. కోటపాటితో పాటు కొక్కుల విద్యాసాగర్, చిగుర్ల మహేష్ ఎన్నారై మలేషియా బాలయ్య న్యాయవాది పాల్గొన్నారు. వారం రోజుల పాటు బిజెపి సీనియర్ నాయకులు కోటపాటి , కొక్కుల విద్యాసాగర్, లు ఓరిస్సా లోని సంబల్ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు. ఒరిస్సా లోని 21 పార్లమెంట్ స్థానాలలో 15 కు పైగా బిజెపి గెలుచుకోనుంది అదేవిధంగా మహారాష్ట్రలోని 48 స్థానాలలో 40 కి పైగా, చత్తీస్ గడ్, లోని మెజారిటీ స్థానాలు గెలుచుకోను న్నట్లు అక్కడి ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ధారించుకున్నట్లు కోటపాటి తెలిపారు. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం మోడీ హవా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంటు ఎన్నికలలో 10 కి పైగా బిజెపి గెలవబోతోంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మూడవసారి ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ నాయకత్వంలో 10 సంవత్సరాలపాటు అవినీతి రహిత పాలన, దేశ భద్రత, స్థిరమైన అభివృద్ధి ఉగ్రవాదుల ఏరివేత ప్రధాన అంశాలుగా ఎన్ డి ఏ కు అనుకూలిస్తున్నాయి. తాము సంబల్ పూర్ ( ఓరిస్సా) లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోసం అక్కడి తెలుగు ప్రజలు మద్దతు కూడా గట్టడంలో సఫలమైనట్లు కోటపాటి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular