రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన బిజిలి అచ్చమ్మ
ద్రోణ ఆదిలాబాద్ బ్యూరో
కాగజ్ నగర్ పట్టణంలో ఉదయం ఇద్దరు వ్యక్తులు మహిళను మాయమాటలతో పట్టాలు దాటిస్తమనీ చెప్పి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్, పర్సులోని 6 వేల రూపాయలు దోచుకుని పరారయ్యారు. కాగ జ్ నగర్ లోని కాపు వాడ పెద్దవాగు రోడ్ కు చెందిన బిజిలి అచ్చమ్మ, కొన్ని రోజుల క్రితం ఖమ్మం వెళ్ళింది. శనివారం ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఆమె కాగ జ్ నగర్ రైల్వే స్టేషన్ లో రైలు దిగింది. చీకటి ఉండడం తో అచ్చమ్మ, మనుమరాలు కీర్తన తో అక్కడే కూర్చుంది. ఇంతలో ఆమె దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను పట్టాలు దాటిస్థమని చెప్పి ముందుకు నడిచారు. పట్టాలు దాటిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గరకు రాగానే ఉన్నట్టుండి మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్, పర్సులోని 6000 నగదు తో పరారయ్యారు. ఈ క్రమంలో అచ్చమ్మ కిండపడగా ఆమె తల, మీద గాయాలయ్యాయి. మహిళా, చిన్నారి అరుపులు వేయడంతో సమీపంలో ఉన్న వాళ్ళు వచ్చారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు ఇచ్చేశారు. దాంతోపాటు కాగ జ్ నగర్ పట్టణ పొలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ తుత్తూరు శంకరయ్య సానుకూలంగా స్పందించి కానిస్టేబుల్ లను వెంట ఇచ్చి సీసీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశించారు.
