దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుల వద్ద నుండి రూ. 9, 22, 000 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 60 వేలు విలువ చేసే వెండి, ఒక ఎల్ఈడీ టీవీ, హోం ధియేటర్, 3 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్, గిటార్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఏడుగురు దొంగల అరెస్ట్
RELATED ARTICLES
