Friday, February 20, 2026

ఎస్సి 57ఉపకులాల ప్రత్యేక కార్పొరేషన్ కై కృషి చేస్తా

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ పట్టణంలోని టి.ఎన్.జి.వో భవన్ లో గోసంగి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SSC విద్యార్థుల ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ గోసంగి కులస్తులు వెనుకబాటును గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎస్సి ఉపకులంలో ఒక్కటైనా గోసంగిలకు మిగతా కులాలకు మేలు జరిగి వారి అభివృద్ధికి ప్రత్యేక ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గోసంగిలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు
అనంతరం గోసంగి SSC పాస్ అయిన గోసంగి విద్యార్థులకు సన్మానం చేసి మేమేంటోను అందజేశారు.


గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ అభివృద్ది , అధికారం జాడలేని ఎస్సీ ఉపకులాలు ఒకప్పుడు పల్లెల్లో కులవృత్తులు చేసుకుంటూ , సంచార జీవనంచేస్తూ , కళారూపాలను ప్రదర్శిస్తు పొట్టగడుపుకుని జీవించే దళిత ఉపకులాలు నేడు వారిని పట్టించుకునే నాధుడు లేక విలవిలలాడుతున్నాయని. ఎస్సీలలో ఉన్న 57 ఉపకులాలకు అభివృద్ధి , అధికారం అందని ద్రాక్షలే అయిన స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీలలో రెండు కులాలు తప్ప మిగతా కులాలు ఇప్పటికి కనీస అభివృద్ధికి నోచుకోలేదు . తెలంగాణ రాష్ట్రంలో 57 ఉపకులాలలో సుమారు ఇరవై రెండు లక్షల ( 22 లక్షలు ) జనాబాను కలిగి ఉన్నప్పటికి ఈ కులాలకు కనీస గుర్తింపు లేదు . సామాజిక , ఆర్థిక , రాజకీయ వివక్షతకు గురైతూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటు , బిక్షాటన చేస్తూ , సంచార జీవనం సాగించే ఈ దళిత ఉపకులాలను గత ప్రభుత్వాలు పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయి కాని వారి బ్రతుకులు బాగు చేసే ప్రయత్నం చేయలేదు . అంతో ఇంతో అభివృద్ది చెందిన మాల , మాదిగ సోదరులు రాజ్యాంగ పరంగా దళితులకు అందే ఫలాలు తమే అనుభవించడం తప్ప మమ్మల్ని గుర్తించి అవకాశాలు కల్పించిన సందర్భాలు లేవు . ఈ సమాజంలో దళితులలో ఇన్ని కులాలు ఉన్నాయ అన్న విషయం కూడా తెలియని పరిస్థితి సమాజంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై పూర్తి నమ్మకం ఉందని త్వరలోనే ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారికి విన్నవించాలని కోరారు దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండ మాట్లాడతానని హామీ ఇవ్వడంతో గోసంగీలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గోసంగి సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు గంధం బుద్దిరాజు, గోసంగి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్నాల లక్ష్మణ్, ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పస్తం పరుశురాం, గోసంగి యువజన సంఘం అధ్యక్షులు ఈర్నాల వినోద్ కుమార్, కొండపల్లి గంగాధర్, వెంకటరమణ, కళ్లెం గంగాధర్, సదుల వీరేషం, గంధం లింబాద్రి, కిషోర్, సంగయ్య, కళ్లెం రాములు, రాజేందర్ గిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular