అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా మల్లెపూల స్వామి గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (లైబ్రరీ) అభివృద్ధి కమిటీని ఆదివారం శాశ్వత సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన లైబ్రరీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా మల్లెపూల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ (తేజ), ఉపాధ్యక్షులుగా కరణం అశోక్ బాబా, ఇల్తెపు రమేష్ ,శివకాంత్ పటేల్, సంయుక్త కార్యదర్శి వడ్ల దత్తురాం, నజీర్, ముఖ్య సలహాదారులుగా ఇల్తెపు శంకర్ , ప్రజ్ఞశ్రీ రాజు , సింగడి పాండు, బొర్ర గంగారం, అల్లే రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వామ్ము చేయకుండా విజ్ఞాన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి యువతకు అవకాశాలు కల్పిస్తామని స్వామి గౌడ్ వ్యక్తం చేశారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రంలో ఎంతో ప్రాధాన్యం గల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని గ్రామానికి చెందిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి లింబూర్ లక్ష్మణ్ కోరారు. విజ్ఞానం కేంద్రాల కోసం గ్రామానికి చెందిన ఎంతో మంది పెద్దలు పుస్తకాల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని వారికి విజ్ఞాన కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులను సభ్యులు అభినందించారు.కార్యక్రమంలో సంగుమహరాజ్, కే.జీ గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
