Friday, February 20, 2026

బోధన్ లో ఎరువుల స్టాక్ పాయింటు ఏర్పాటు చేయడం అభినందనీయం

కోరమండల్ ఇంటర్నేషనల్ వారు బోధన్ లో ఎరువుల రేక్ ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, రవాణా దూరం తగ్గి రవాణా చార్జీలు ఎరువులపై తగ్గుతాయని బోధన్ ప్రాంత రైతాంగానికి లాభదాయకమని కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి అన్నారు.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు బోధన్ లో రేక్  ప్రారంభించడం మూలంగా చుట్టుపక్కల ఉన్న సొసైటీలకు  ఫర్టిలైజర్ డీలర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నిజామాబాద్ కన్నా బోధన్ దగ్గరగా ఉండడం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లు తగ్గుతాయి మరియు వెంటనే చుట్టుపక్కల ఉన్న డీలర్స్ కి సొసైటీలకు ఫర్టిలైజర్ అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ మరియు కోరమండల్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి , కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, బోధన్ వ్యవసాయ అధికారి సంతోష్ , నిజాంబాద్ దీపక్ అగర్వాల్ ఓంకార్ డీలర్, బోధన్ శ్రీనివాస డీలర్ మరియు డ్రైవర్స్,హమాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు .ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ బోదన్ లో రైల్వే లైన్ రేక్ ద్వారా మొట్టమొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన కోరమండల్ ఇంటర్నేషనల్ వారికి అభినందనలు తెలియజేస్తూ సొసైటీలకు రవాణాచార్జీలు తగ్గి కొంత లాభం జరుగుతుందని, సొసైటీలకు డీలర్లకు రైతులకు ఎల్లప్పుడూ ఎరువులు అందుబాటులో ఉంటాయని బోధన్ లోని లారీ ఓనర్స్ కి, హ మాలీలకి కొంత పని లభిస్తుందన్నారు. ఇతర ఎరువుల కంపెనీల వారు బోధన్ లో ర్యాక్ పాయింట్  ప్రారంభిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular