ద్రోణ హైదరాబాద్ బ్యూరో
మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు భరోసా ఇచ్చారు. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందటం ఖాయమని భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాకేష్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ క్యాడర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభలో తెలంగాణ గళాన్ని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిథ్యం అనివార్యం అని అన్నారు. రాకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ప్రచారం ముగిసే తేదీ నాటికి బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడ నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాయని అన్నారు. నమూనా బ్యాలెట్ పేపర్ ను కార్యకర్తలు ప్రదర్శించి అవగాహన కల్పించారని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా రాకేష్ రెడ్డికి ఓటేసిన ఓటరు మహాశయులకు, దాదాపు రెండు నెలలకు పైగా ప్రచార కార్యక్రమాల్లో అహర్నిశలు పాల్గొన్న నేతలకు, కార్యకర్తలకు నల్లమోతు భాస్కర్ రావు ధన్యవాదములు తెలిపారు.
