Friday, February 20, 2026

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుజిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని
రిసెప్షన్ కేంద్రంలో పరిశీలించిన కలెక్టర్

ద్రోణ వరంగల్ బ్యూరో

వరంగల్, 27 మే 2024.
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. జిల్లాలో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల వరకు 70.83% పోలింగ్ నమోదయినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
పోలింగ్ అనంతరం పోలీసు భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు, ఇతరు ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులు, సిబ్బంది వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన రిసెప్షన్ కేంద్రానికి తీసుకొస్తున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అందజేయాలన్నారు.
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వారిగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులు సిబ్బంది సమష్టి కృషితో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 59 పోలింగ్ కేంద్రాల నుండి సేకరించిన వెంటనే బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని అధికారులు, పటిష్ట భద్రత మధ్య నల్గొండ కు తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular