Friday, February 20, 2026

నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు

ద్రోణ అమరావతి బ్యూరో

నకలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది.

ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది…

విశ్వసనీయ సమాచారం మేరకు…

గుంటూరు జిల్లా తాడేపల్లి ,సీతానగరం కి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తుంది.ఈ ముఠా రూ. లక్ష అసలు నోట్లు ఇస్తే రూ. మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకుంది.
ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది. విజయవాడ సమీపంలోని సూరాయిపాలెం వద్దకు వచ్చి ఇరు వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అని సమాచారం.ఈ క్రమంలో ఆకస్మికంగా పోలీస్ స్టిక్కర్ ఉన్న తెల్లటి స్కార్పియో కారు అందులో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసుల పేరుతో హడావుడి చేశారు. ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించడంతో పోలుసుల పేరుతో హడావుడి చేసినవారు, కొందరు స్కార్పియో కారులో పారిపోయి, బెలేనో కారు ని వదిలి పారిపోయారు. దీంతో కంగుతిన్న మిర్యాలగూడ వాసులు ఏం చేయాలో పాలుపోక తాము ఆస్పత్రికి వెళుతుండగా వెంబడించి దోపిడీకి ప్రయత్నం చేశారని ప్లేటు ఫిరాయించినట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నకిలీ పోలీసులు వదిలి వెళ్లిన కారును స్టేషన్ కు తరలించారు
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు నకలీ కరెన్సీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు.
మిర్యాలగూడ వారు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించారు.మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.వీరిలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అరెస్టు అయిన ఓ నిందితుడు కూడా ఉన్నట్లు సమాచారం.మరోవైపు ఈ కేసును నీరుగార్చేందుకు గతంలో విజయవాడ సీసీఎస్ లో పని చేసిన ఓ ఏఎస్ఐగా విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular