కామారెడ్డి జిల్లా మిర్జాపూర్ సింగిల్ విండో అధ్యక్షులుగా రాంబాబును సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహకార శాఖ అధికారులు సంఘ కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. సంఘ సభ్యులు ఏకగ్రీవంగా రాంబాబును ఎన్నుకున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ గిరిజన నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, కమలాకర్ రెడ్డి, నందు పటేల్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, వీరియా నాయక్, మంత్రి గణేష్, శంకర్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మిర్జాపూర్ విండో అధ్యక్షులుగా రాంబాబు
RELATED ARTICLES
