Wednesday, February 18, 2026

తాగిన మత్తులో ఊగిసలాటలు

ఎన్నడూ జరగని అవమానాలు

దేవుడంటే ఇంత అలుసా

ఇలాంటి వారిని పట్టించుకునే నాధుడే లేడా

తిరుమనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా బీరప్ప పండుగ అని జరుగుతుంది. ఆ ఊరిలో కొత్తగా గుడి కట్టిన సందర్భంగా ఆ కురుమ కులస్తులు ఎంతో ఆనంద ఉత్సాహాలతో మునిగి తేలుతున్నారు. కానీ కొంతమంది దానిని అవమాన పరుస్తూ వ్యంగ్య ప్రదర్శనలు రోడ్లపై చేస్తూ వచ్చే పోయే ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఊరిలో బస్టాండ్ దగ్గర ఒక బస్సు ప్రయాణికులు దిగడానికి ఆగి ఉండడం చూసి వెనుక నుంచి బస్సు పైకి ఎక్కి పిచ్చి ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను కూడా ఎంతో ఇబ్బందులకు గురిచేసి వారిపై కోపంతో వారిని బెదిరించారు. ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా త్రాగిన మైకంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్న విలేజ్ కమిటీ కూడా ఇబ్బందులకు గురయ్యారే కానీ వారిని ఏమీ అనలేక పోయామని మేమే అవమానానికి గురి అవుతున్నామని వాపోతున్నారు. ఇలాంటి వారిని ఏమనాలో కూడా తెలియని పరిస్థితులలో ఊరి ప్రజలందరూ చూస్తూ నిలబడిపోయారు. ఇంత జరుగుతున్న వారి కులస్తులు కూడా ఏమీ అనకపోవడం ఎవరి అండదండలతో పండుగ పూట ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో తెలియడం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular