ద్రోణ హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.
జూన్ 1 :
జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.
జూన్ 2 :
తెలంగాణ ఆవిర్భావ రోజు., జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ధి కాలం గడుస్తున్న నేపధ్యంలో… దశాబ్ది ముగింపు వేడుకల సభ ను హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగనున్నది.
హైదరాబాద్ లో పలు దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
