Friday, February 20, 2026

ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ తో ముఖ్యమంత్రి ఎన్టీఆర్

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

1983లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ఎన్.టి. రామారావు . అనంతరం ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ని కలుసుకోవలసి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఎన్.టి. రామారావు ప్రధానమంత్రి ఛాంబర్లోకి వెళ్లారు. ముందు ఇందిరా గాంధీ ఆయన పట్ల బింకంగానే ఉన్నప్పటికి, రామారావు లోని నిరాడంబరత, సంస్కారాన్ని ఇట్టే అర్థం చేసుకుని ప్రసన్నంగా మాట్లాడి రాష్రాభివృద్ధికి ఏమి కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భగా రామారావు ఆమెతో మా రాష్ట్రంలో మిమ్మల్ని “అమ్మ” (మదర్) అంటారు అని మొదలుపెట్టి, పెట్టే అమ్మనే కదా ఎవరైనా అడుగుతారు అంటూ ఏ కపటమూ లేకుండా రాష్ట్రం అవసరాలని చెప్పిన తీరు ఆమెకి బాగా నచ్చిందట. ఐదు నిమిషాలు అన్నది కాస్తా దాదాపు 30 నిమిషాల సేపు ఆత్మీయ సమావేశంగా సాగింది.
ఎన్.టి.రామారావు విచక్షణ, వివేకం కలిగిన ముఖ్యమంత్రి అని ఆ తర్వాత తన అధికారుల దగ్గర సంతృప్తి వ్యక్తం చేశారట ఇందిరా గాంధీ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular