ద్రోణ బోధన్ ప్రతినిధి
కోటగిరి మండలం కేంద్రం మిర్జాపూర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు.
మంగళవారం ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా చిరస్థాయిగా సమాజంలో నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ ఆయన చేసిన సేవలను స్మరించుకొని ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకొని సమాజసేవ చేయాలని ఎన్టీఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ డెలిగేట్ కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ
ఒక మనిషి గురించి చెప్పుకోవాలంటే ఏముంటుంది? పుట్టారు.. పెరిగారు.. మరణించారు. అంతే కదా. కానీ, మహనీయుల గురించి మాట్లాడుకోవాలంటే. సామాన్యుడిగా పుట్టి టార్చ్ బేరర్ గా మారినవారి గురించి చర్చించాలంటే.. మనకి అసలు టైమే చాలదు. రోజులు నెలలు.. సంవత్సరాలు ఇలా కాలం గిర్రున తిరగవచ్చు. కొందరు చూపించిన మార్గం. కొంతమంది చేసిన మంచి. వారు గతించినా.. మన జీవితాల్లో మాత్రం ఎప్పుడూ ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అలాంటివారిలో తెలుగుతనానికి.. తెలుగు గౌరవానికి.. తెలుగువారి తెగింపుకి.. తెలుగుజాతి మర్యాదకి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చినవారు నందమూరి తారకరామారావు మొదటి వరుసలో ఉండే మహనీయుడు. ఆయన పుట్టినరోజు ఎన్టీఆర్ గా మనం పిలుచుకునే ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరంజీవే. అందుకే పుట్టినరోజు అంటున్నాం.ఇట్టి కార్యక్రమం లో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ వల్లెపల్లి శ్రీనివాస్ రావు గంగాధర్ దేశాయ్, సలీం కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్,కిషోర్ బాబు సాయి రెడ్డి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
