ద్రోణ బోధన్ ప్రతినిధి
తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని బోధన్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణం తో పాటు పెంటకుర్దు,జాడి జమాల్పూర్,సాలురా క్యాంప్ తదితర గ్రామాల్లో జయంతి ఉత్సవాలను తెలుగు దేశంపార్టి నాయకులు కార్యకర్తలు,ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు.పెంటకుర్దు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్నికి పూలమాలలు సమ్పర్పించి నివాళులు అర్పించారు. జాడి,సాలురా క్యాంప్ లలో ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద పూలు సమర్పించి ఎన్టీఆర్ సేవలను స్మరించు కున్నారు. బోధన్ కొత్త బస్టాండ్ వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉనందున హంగుఆర్బాటలకు దూరంగా నిబంధనల మేరకు సేవకార్యక్రమము మాత్రమే రాజకీయలకు అతీతంగా నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. బాటసారులకు,ప్రయాణికులకు మజ్జిగ వితరణ పంపిణీ చేశారు.ఎన్టీఆర్ అమర్ హై అని నినాదాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,న్యాయవాది హన్మంతరావు,టీడీపీ బోధన్ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి,ఎన్టీఆర్ అభిమాన సంఘము అధ్యక్షులు పల్లెం పాటి శివన్నారాయణ టీడీపీ నాయకులు పావులూరి వెంకటేశ్వర రావు,సచిన్ పటేల్,విట్ఠల్ పటేల్,ఉదయ్ భాస్కర్,విశ్వేసర్ రావు,ఎన్టీఆర్ అభిమాన సంఘము నాయకులు
రంగారావుగాంధీ,వడ్లముడి,వెంకటేశ్వర రావు,సిద్ధాపుర్ సూరిబాబు, నల్గొండ వెంకటేశ్వర రావు,కర్నటి రామకృష్ణ,అచ్చన్ పల్లి విజయ్,రత్నాకర్, మువ్వ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
