నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సాలూర చెక్ పోస్ట్ పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

చెక్ పోస్ట్ అధికారుల వద్ద అనధికారికంగా ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. రాష్ట్రంలో ఏకకాలంలో సరిహద్దు చెక్పోస్టుల పై నేడు ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల చెక్ పోస్ట్ వద్ద వానదారుల నుండి మామూళ్ల రూపంలో అధికారులు డబ్బు రాబడుతున్నారు.

తీసుకుంటున్న విషయం తెలుసుకొని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వాహనదారులు బయట కౌంటర్ పైన డబ్బులు పెట్టి వెళ్లే దృశ్యాలను అధికారులు గమనిస్తూనే ఉన్నారు. అయితే యాంటీ కరప్షన్ బ్యూరో డిజి ఆదేశాల నుసారం సాలురలోని చెక్ పోస్ట్ పై దాడులు నిర్వహించారు. ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు.

కంప్యూటర్ ఆపరేటర్ వద్ద నుండి సుమారు 13 వేలకు పైగా అక్రమంగా ఉన్న డబ్బులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
