Monday, May 11, 2026

పేదలకు రేషన్ కార్డులు

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ మేరకు మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular