ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
అనంతపురం జిల్లాలో సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా పనిచేస్తు మరోపక్క ఆయుర్వేదిక ఈ నైపుణ్యాన్ని గడించి ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు ఆయుర్వేదిక మందులను అందించి వ్యాధులను న్యాయం చేశారు.గడిచిన 18 ఏళ్ల నుండి వివిధ వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తూ వచ్చారు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి గర్తింపును ఇచ్చే సదుద్దేశ్యంతో ఎన్టీఆర్ స్మారక జాతీయ సేవా పురస్కారము ను ఏర్పాటు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయుర్వేద వైద్యం లో రాజశేఖర్ సేవలకు గాను ఈ పురస్కారం అందించారు…స్వర్గీయ ఎన్టీఆర్ 101 వ జయంతి సందర్భంగా..ఆయన కుమారుడు నందమూరి మోహనకృష్ణ, టీడీపీ జాతీయ కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు, జనార్ధన్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి వివిధ అంశాలలో సామాజిక సేవ చేసిన లబ్ద ప్రతిష్ఠులు హాజరయ్యారు. సాహిత్యం తో పాటు వివిధ రంగాలలో సేవలందించినటువంటి వారికి ఈ పురస్కారాన్ని అందించారు.. మొత్తం 60 మంది సన్మానితులైన ఈ అవార్డు కార్యక్రమంలో ఆయుర్వేద విభాగం నుంచి కేవలం రాజశేఖర్ ఒక్కడికి మాత్రమే అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు మనవరాలు నందమూరి మోహన హాజరయ్యారు. కార్యక్రమానికి కళా రత్న డాక్టర్ బిక్కీ కృష్ణ అధ్యక్షత వహించారు.
