దొంగిలించబడిన 10,97,600 విలువ గల బంగారు వెండి ఆభరణాలు పూర్తి సొత్తు రికవరీ చేసి భరోసా కల్పించిన రామగుండం కమిషనరేట్ పోలీసులు.



ఈనెల 26, 27 అర్ధరాత్రి సల్పల శ్రీనివాస్ వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంట్లోకి చొరబడి దొంగతనం కు పాల్పడినాడు అని అనుమానం కలదు. అభి ఫిర్యాదుదారు నెందుగూరి రామన్న కేతనపల్లి గ్రామంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 35/2024, U/S. 457, 380, 75 IPC
సెక్షన్ ల తో కేసు నమోదు చేశారు. దర్యాప్తు లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నీల్వాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చెన్నూర్ రూరల్ పరిసర ప్రాంతాలలో టీమ్ లను ఏర్పాటు చేసి గాలించారు. నిందితుని కోసం వెతుకుతుండగా తేది 28-05-2024. మల్లంపేట గ్రామ ప్రారంభం వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు, నికర నగదు రూ. 2,62,600/- ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
నిందితుడు సల్పల శ్రీనివాస్ పై గతంలో కూడా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి.
రెండు బంగారు నెక్లెస్‌లు. ఒక్కదాని బరువు 1 ½ తులా…. మొత్తం 3 తులాలు,
3 బంగారు గొలుసులు, ఒక్కొక్క దాని బరువు 3 తులాలు…..మొత్తం 9 తులాలు, 2 బంగారు మాటీలు బరువు ¼ తులం
2 ఇయర్ రింగ్స్ బరువు . ¼ తులా, ఒక బంగారు ఉంగరం. 0.75 గ్రా.
రెండు బంగారు ఉంగరాలు. 1.5 గ్రాములు,
2 వెండి కాళ్ళ పట్టిలు…6 తులాలు ,
రూ. 2,62,600/- నగదు,
నిందితుని వద్దామొత్తం విలువ 10,97,600/-విలువచేసే సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసింది తధానుగుణంగా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది ఈ సందర్భంగా ప్రజలను అభినందిస్తున్నాము మరియు నిందితులను పట్టుకొనడంలో చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ మరియు పోలీస్ సిబ్బంది ని రామగుండం సిపి అభినందించారు.
