ఎండాకాలం దృష్ట్యా బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో త్రాగు నీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామంలోని 11,12 వ వార్డులో త్రాగునీటి సమస్య ఉండడంతో కాంగ్రెస్ నాయకులు టప్పా సాయిలు,సాయిరెడ్డి,అశోక్ రెడ్డి లు చరవాణి ద్వార ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన రాత్రికి రాత్రి బోర్ మోటార్ ను పంపించి బోర్ వేయించి ప్రజలకు త్రాగునీటి సమస్య ఇబ్బంది లేకుండ చేసిన సందర్బంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఇందుకు సహకరించిన భవాని పెట్ నవీన్ కు గ్రామస్థులు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.బోర్ వేయించి ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారని వారు కొనియాడారు.ఈ సంధర్బంగా సీనియర్ నాయకులు సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే పాఠశాలల్లో విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని పాఠశాలల మరమ్మత్తులకు,
టాయిలెట్ల నిర్మాణలకు నిధులు మంజూరు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో డివి.సంతోష్, నరేందర్ గౌడ్,బోయి తిరుమలేశ్,గంగాధర్,ఆటో పాశ,వినోద్,శంకర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చిన బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
RELATED ARTICLES
