Friday, February 20, 2026

చింత ప్రదీప్ మృతికి నిజాంబాద్ ప్రెస్ క్లబ్ సంతాపం

నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సబ్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ చింత ప్రదీప్ గురువారం తెల్లవారుజామున క్యాన్సర్ తో చనిపోయారు. సాయంత్రం ఆయన స్వగ్రామం రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో అంత్యక్రియలు చేయనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సబ్ ఎడిటర్ చింత ప్రదీప్ అకాల మరణం పై విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ గత చాలాకాలంగా వివిధ దినపత్రికల్లో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించిన చింత ప్రదీప్ క్యాన్సర్ బారిన పడటం బాధాకరమని అన్నారు.
ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి
తెలపడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular