Friday, February 20, 2026

తెలంగాణ రాష్ట్ర గీతంగా “జయ జయహే తెలంగాణ”

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గీతంపై నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఒక ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం “జయ జయహే తెలంగాణ” గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవదినం జూన్ 2వ తేదీన నిర్వహించే దశాబ్ధి ముగింపు వేడుకల సందర్భంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular