“బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్”
ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే
దినదినాభివృద్ధిలో ఇందూర్ మోడల్ హై స్కూల్
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో గల ఇందూర్ మోడల్ హై స్కూల్ కు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది అవార్డుల పంట పండింది. చదువు మార్పు లే ముఖ్యం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ పాఠశాలలో విశాలమైన ఆటస్థలం ప్రత్యేక విద్యాబోధన, అనేక కార్యక్రమాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు అంశాలపై అవగాహన చెప్పడం జరుగుతుంది. (ఇంటర్నేషనల్ బ్రిలియన్స్) 20 24 అవార్డు బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ ప్రాధాన్యతను దక్కించుకుంది పాఠశాల గత 15 సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ గా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం (ఎన్ సి సి) (ఎస్ కట్) మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ కలిసి ఉండడమే కాక (ఎన్ సి సి) విభాగంలో “నేషనల్ పీరేడ్” కు రెండు పర్యాయాలు ఎన్నిక కావడం జరిగింది. “సైన్స్ ఫెయిర్” లో జాతీయ స్థాయిలో బహుమతులను గెలవడం జరిగింది.

పాఠశాల నిర్వహణలో మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయుల అంకితభావం పాఠశాల క్రీడా మైదానం, వినూత్నత పద్ధతులలో విద్యార్థులకు విద్యాబోధన అంశాలను పరిగణలోకి తీసుకొని “న్యూఢిల్లీ” కి చెందిన “హై క్వాలిఫైడ్” మీడియా గ్రూపు ద్వారా 20 24 ఏప్రిల్ 20న ఇందూర్ హై స్కూల్ ను “ఐబీఏ ఇంటర్నేషనల్ బ్రిలియన్స్”( అవార్డు 20 24) కు ఎంపిక చేసింది ఈ అవార్డు పోస్ట్ ద్వారా సోమవారం పంపించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ తమ పాఠశాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి నాయొక్క కృతజ్ఞతలు అని తెలిపారు.
