Friday, February 20, 2026

మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు

అయ్యప్ప స్కానింగ్ సెంటర్ మూసివేయాలి

ప్రగతిశీల మహిళా సంఘం బోధన్

వైద్యం కోసం వచ్చిన మహిళలను సభ్యకరమైన ఫొటోస్ వీడియోలు చిత్రీకరించి మహిళల ఆత్మ గౌరవం అభిమానం దెబ్బతీస్తున్న అయ్యప్ప సిటీ సెంటర్ ను వెంటనే మూసివేయాలని ప్రగతిశీల మహిళా సంఘ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తను మాట్లాడుతూ తరగతి శీల మహిళా సంఘం బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు సిటీ స్కానింగ్ సెంటర్ ల లో ప్రభుత్వం నియమించినటువంటి ఆశా వర్కర్ల ద్వారానే స్కానింగ్ చేయాలని కచ్చితంగా స్కానింగ్ తీసే ముందు ఆశ వర్కర్ పక్కనే ఉండి తీయించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా స్కానింగ్ సెంటర్ లోని పేర్లతో మహిళల మనోభావాలను దెబ్బ తీస్తూ మహిళలను బ్లాక్ మెయిల్ చేయడానికి దోహదపడుతున్నారని ఈ విధంగా చేస్తున్న వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు పి బిపాషా బేగం,జి. పార్వతి, లక్ష్మి, బి పోచవ్వ, సావిత్రి, రాజమణి, గంగమణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular