Friday, February 20, 2026

ఆదివాసి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ద్రోణ నిజాంబాద్ ప్రతినిధి

నిజామబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానించి మెమొంటోలుఅందజేశారు
అధ్యక్షులు పుట్ట రాజేశ్వర్ ప్రధాన కార్యదర్శి కోసేడుగు రవి, కార్యవర్గ అధ్యక్షులు కొండ్రు నవీన్ ఐలపూర్ రాజు మరియు కార్యవర్గం సభ్యులు గంట గంగాధర్ కోల్కత్ రాంప్రసాద్ తమ్మల శ్రీనివాస్ సురేష్ రుక్మాజీ మరియు జానుముల సంజీవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
శుక్రవారం ఎం ఆర్ గార్డెన్ ఆర్మూర్ నందు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం అధ్యక్షులు గాండ్ల రామ్ చందర్, అధ్యక్షులు బండారి భోజన్న, మాజీ అధ్యక్షులు గడ్డం శంకర్, సేవ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు లోలం గంగాధర్ కోశాధికారి శానం పవన్ ఉపాధ్యక్షులు ధాత్రి అంజయ్య, మూఢ అశోక్ అడ్వైసర్ తడపాకల్ మారుతీ కంచు సతీష్ హాజరై SSC 9.00 జి పి ఏ నుండి 10/10 జిపిఏ వచ్చిన 25 మంది విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ 900ల పైన మార్కులు వచ్చిన ఇద్దరు విద్యార్థులను, కో కో లో మంద రిషిక్ నేషనల్ లో ఆడి మరియు ఇంటర్నేషనల్ నేపాల్ ఆడబోవుచున్న క్రీడ కారుణ్ణి సన్మానించిన మెమంటో లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జి సి డి ఓ సింగం వనిత నిజామాబాద్ మరియు డాక్టర్ మంతెన రవికుమార్ ఆలూరు మన ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించటం జరిగింది. మరియు జిల్లాలో వివిధ మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు యువజన నాయకులు హజారై విజయవంతం చేశారు.

ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఆదివాసి నాయకపోడ్ అధ్యక్షుడు, అధ్యక్షులు బండారు భోజన్న , మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శంకర్ మరియు జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడు విద్యార్థిని విద్యార్థులకు చదువు విషయంలో అన్ని విధాల జిల్లా సేవా సంఘం నుండి మరియు ఉద్యోగ సేవ సంఘంలో నుండి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని మీరందరూ కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండి మంచి ఉద్యోగాలు చేయాలని మన జాతికి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular