Friday, February 20, 2026

CPI ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ


నేడు స్థానిక అంబేద్కర్ కాలనీ హమాలియూనియన్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ఆవిష్కరించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయినదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు,నియామకాల కోసం జరిగిందని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని పోరాటం నిర్వహించిన పార్టీ సిపిఐనే అని అన్నారు గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతోనే

ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డదని ఇప్పటికైనా పాలక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యదర్శి వై.ఓమయ్య, నాయకులు పి.నర్సింగరావు, రఘురాం, పిన్నెల.హనుమాన్లు, ఆలీ ఇమ్రాన్, రమేష్, అనిల్, సాయిలు, పరశురాం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular