నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తమ వంతు సహాయంగా కాంగ్రెస్ నాయకులు 15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జల్లపల్లి ఫారంలో నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ మహబూబ్ కుమార్తె అస్మా బేగం వివాహానికి హాజరై *15000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. దామరంచ సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి , ఇక్బాల్,ఎంపీటీసీ బక్క నారాయణ,వర్ని మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు,మొయినుద్దీన్, యశ్వంత్,అబ్దుల్లా, బాబీ సెట్, తస్లీమ్ ఖాన్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఎలమంచిలి ఆర్థిక సహాయం
RELATED ARTICLES
