తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జండా ఎగరవేసి రెపరెపలాడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా హైదరాబాదులోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కమల్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు.


