Friday, February 20, 2026

బిచ్కుంద ప్రాంతంలో భారీ వర్షం

రైతన్నల హర్షం

ద్రోణ కామారెడ్డి బ్యూరో

ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారి వాతావరణం చల్లబడ్డది. కురుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తొలకరి రాకముందే వర్షం పడటంతో రైతన్నలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు బానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. వర్షం పడటంతో వాతావరణ ఒక్కసారిగా చల్లబడ్డది. వర్షం పడటంతో రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించుకునే వీలు కలుగుతుందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సో అలాంటి పంటలను సాగు చేసేందుకు రైతులు భూములను సిద్ధం చేశారు. మరోపక్క వరి సాగు చేసే రైతులు కూడా కొంతమంది ఇప్పటికే వరి నారుమళ్ళను సిద్ధం చేశారు. తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ కొన్నిచోట్ల ఇప్పటికే రైతులు వరీనాట్లు ప్రారంభించారు. ఈ వర్షంతో చాలా ప్రాంతాల్లో వరి నాట్లు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడటం రైతులకు మాత్రం ఎంతో మేలు చేకూరుతుంది. వర్షా ఆధారిత పంటలను సాగు చేసే వ్యవసాయదారులు భూములను దుక్కి దున్నుకొని పంటల సాగు చేసుకునేందుకు వర్షం ఎంతగానో తోడైందని చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular