Monday, May 11, 2026

మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆదర్శప్రాయుల సంచలన ప్రకటన

ద్రోణ మిర్యాలగూడ

మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓ సంచలన ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శప్రాయాలుగా నిలిచారు.
మిర్యాలగూడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన ప్రకటన. తన
మిర్యాలగూడ నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్లీపర్లకు తన జీతం నుండి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం చేశారు.గతంలో జీతాలు ఇవ్వలేక స్వీపర్లను విద్యాశాఖ అధికారులు తొలగించారు.
తన ఎమ్మెల్యే పదవి కాలం ఉన్నంతవరకు స్లీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. వారంలో మూడు రోజులు ఊరు..వాడ..తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట నున్నట్లు తెలిపారు. పర్యటిస్తూ..అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు.
గత పది ఏళ్లుగా ఆయా వార్డులలో,గ్రామాల్లో,తండాల్లో జరిగిన అభివృద్ధి సమీక్షించి,
అవసరాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు స్థానికులతో ప్రణాళికలు రూపొందించేందుకు ప్రయత్నం చేద్దామన్నారు.గుర్తించిన అభివృద్ధి పనులను తక్షణం అమలు చేసేలా చర్యలు చేపతుందన్నట్లు ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular