ద్రోణ బోధన్ జూన్ 2

వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు జరుగుతున్న అన్యాయం గురించి తాసిల్దార్ వద్ద తన గోడను వెళ్ళగక్కారు.
తనకూ, తన రెండు నెలల పాపకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదని గుండవారి లగ్నేశ్వరి హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తూ ,తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని తహసిల్దార్ సాయిలకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ తనకు జలాల్పూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంచి పెళ్లి చేసుకుంటానని, తనతో జీవనం కొనసాగించి, నాలుగు నెలల పాపకు జన్మనిచ్చారని తెలిపింది, పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి, మోసం చేశాడని ప్రస్తుతం పెళ్లి చేసుకోమంటే ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని తెలిపింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరింది. అనంతరం తాసిల్దార్ సాయిలు తోపాటు రుద్రూర్ సిఐతో మాట్లాడి ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. సిఐ మాట్లాడుతూ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
