Saturday, February 21, 2026

మా గురువు ప్రకాష్ సార్

మొదటి తరం జర్నలిస్టు మా సారు
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ద్రోణ జూన్ 02

మా గురువు ప్రకాష్ సార్. మొదటి తరం జర్నలిస్టు.
ఒకనాడు వసతులు లేని సమయంలో జర్నలిజం జీవితాన్ని ప్రారంభించి నేటికీ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్న సీనియర్ పాత్రికేయులు గుడిపల్లి ప్రకాశ్ (పేపర్ ప్రకాష్) మా గురువు అంటూ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. జర్నలిజంలో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం గడిపిన పేపర్ ప్రకాష్ సార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టుల సలహాలు సూచనలు మాకు ఎల్లప్పుడూ అందించాలని ఆకాంక్షించారు.
షాద్ నగర్ లో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరూ పత్రిక అంటే ఏమిటో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి తరం విలేకరిగా బాధ్యతలు నిర్వర్తించి గుడిపల్లి ప్రకాశ్ గా పరిచయం అయి ఇంటి పేరును పేపర్ ప్రకాష్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. జర్నలిస్టు అంటే మొదటగా అందరూ షాద్ నగర్ లో గుర్తుచూసుకునేది పేపర్ ప్రకాశ్ సార్ అని ఆయన ఎందరో నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శకులు అని ఎమ్మెల్యే శంకర్ పేర్కోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular