Monday, May 11, 2026

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు

హాజరైన మాజీ శాసనసభ్యులు బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్

ద్రోణ నిజాంబాద్ బ్యూరో

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగింపు సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జాతీయ పథకాన్ని మరియు పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కాకతీయుల తోరణం చార్మినార్ ను తొలగించడం తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఉన్న ప్రేమ పాలన మీద లేదని అన్నారు. ఉంటే రైతుల గురించి ఆలోచించేవాడని అన్నారు.


ఇప్పటివరకు రైతుబంధు, భరోసా ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దండు నీతు కిరణ్ ,సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్,సత్యప్రకాష్ ఎనగందుల మురళి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular