ద్రోణ ఢిల్లీ
ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా ముగిసింది.
ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు.
మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు.మన దేశ ఓటర్ల సంఖ్య యూరోపియన్ యూనియన్ జనాభాకు 2.5 రెట్లు.ప్రపంచం లోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు.ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం.
85 ఏళ్ల పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారు.
యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ దేశాల జనాభా కంటే మన ఓటర్ల సంఖ్య ఎక్కువ.
