ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.
నగరంలోని సైబర్ చౌక్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడడంతో కొన్ని బైక్‌లు రోడ్డు దాటుతున్నాయి.
ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.
రోడ్డు దాటుతున్న బైక్‌లను ఢీకొట్టింది. దీంతో బైక్‌లపై ఉన్న వారు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఓ చిన్నారి కిందపడ్డా, అదృష్టశాత్తూ ఏమీ కాలేదు.
