Saturday, February 21, 2026

9న బాబు ప్రమాణ స్వీకారం

ద్రోణ అమరావతి బ్యూరో

ఏపీలో టీడీపీ కూటమి విజ యం ఖాయమైన నేపథ్యం లో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఈ నెల 9వ తేదీన అమరావతీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 4వ సారి సీఎం ప్రమాణం చేయనున్నారు. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

మరోసారి రిపీట్‌ అయిన స్పీకర్‌ సెంటిమెంట్‌

ఎన్నికల ఫలితాల్లో మరో సారి స్పీకర్‌ సెంటిమెంట్ కొనసాగింది. 1999 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్లుగా పనిచేసిన వారు తర్వాతి ఎన్నికల్లో గెలిచినట్లు చరిత్రలో లేదు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఓటమి దిశగా అడుగులు వేస్తుండడంతో ఏపీలో మరోసారి స్పీకర్‌ సెంటి మెంట్ రిపీట్‌ అయినట్లు స్పష్టమవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular